శ్లోకం - 2
అధియజ్ఞః కథం కో௨త్ర దేహే௨స్మిన్ మధుసూదన | ప్రయాణకాలే చ కథం జ్ఞేయో௨సి నియతాత్మభిః ||
తాత్పర్యం
అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ మధుసూదనా(కృష్ణా), అధియజ్ఞము అంటే ఏమిటి? ఆ అధియజ్ఞము ఈ శరీరమునందు ఎలా ఉండును మరియు అది ఎలా కలుగును? మనోనిగ్రహం కలిగిన వారు మరణ సమయంలో నిన్ను ఎలా తెలుసుకొనగలరు.