శ్లోకం - 3

శ్రీ భగవానువాచ: అక్షరం బ్రహ్మ పరమం స్వభావో௨ధ్యాత్మముచ్యతే | భూతభావోద్భవకరః విసర్గః కర్మసంజ్ఞితః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: బ్రహ్మం అనగా సర్వోన్నత్తమైనది మరియు శాశ్వతమైనది(నాశనం లేనిది). జీవి యొక్క ఆత్మ తత్త్వమునే అధ్యాత్మము అని అంటారు. కర్మ అంటే ఆత్మచే చేయబడిన పనులు, ఈ కర్మలే జీవాత్మను జనన మరణ చక్రంలో త్రిప్పుతుంటాయి.