శ్లోకం - 4
అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతమ్ | అధియజ్ఞో௨హమేవాత్ర దేహే దేహభృతాం వర ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, ఈ సృష్టి నందు భౌతిక శరీరం వంటి నశించే పదార్థములు అన్నియును అధిభూతములు అనబడును. దేవతల ప్రభువైన భగవంతుని విశ్వ రూపమునే అధిదైవము అంటారు. సర్వ ప్రాణుల హృదయాలలో నివసించే వాసుదేవుడినైన నేనే అధియజ్ఞము.