శ్లోకం - 5
అంతకాలే చ మామేవ స్మరన్‌ముక్త్వా కలేవరమ్ | యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: మరణ సమయంలో కూడా నన్నే స్మరిస్తూ భౌతిక దేహాన్ని విడిచిపెట్టే వారు నన్నే చేరుకుంటారు. ఇందులో ఎటువంటి సందేహము లేదు.