శ్లోకం - 7
తస్మాత్‌సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ | మయ్యర్పితమనోబుద్ధిః మామేవైష్యస్యసంశయమ్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కావున ఓ అర్జునా, అన్ని సమయాలలో నన్నే స్మరిస్తూ యుద్ధం చేయుము. నీ మనస్సు మరియు బుద్ధిని నాపై కేంద్రీకరించినట్లయితే, నీవు నిస్సందేహంగా నన్నే చేరుకుంటావు.