శ్లోకం - 8
అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా | పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ పార్థా(అర్జునా), యోగ అభ్యాసము చేత మరియు మనస్సు నందు వేరే ధ్యాస ఏ మాత్రమూ లేకుండా నిరంతరం పరమేశ్వరుడైన నన్ను స్మరించుట యందే నిమగ్నం చేస్తే, నీవు తప్పకుండా నన్ను పొందగలవు.