శ్లోకం - 10

ప్రయాణకాలే మనసా௨చలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ | భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ స తం పరం పురుషముపైతి దివ్యమ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: మరణకాలంలో యోగ అభ్యాసము చేత లభించిన అచంచలమైన మనస్సుతో కనుబొమల మధ్య ప్రాణవాయువును నిలిపి అత్యంత భక్తితో స్మరించువాడు ఆ పరమేశ్వరుడినే చేరును.