శ్లోకం - 11

యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః | యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: వేదాలు తెలిసిన వారు శాశ్వతమని(నాశనం లేనిది) చెప్పేదీ, కామక్రోధాలను జయించిన యోగులు చేరేదీ, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ప్రాపంచిక భోగాలను త్యజించే వారు పొందదల్చిన ఆ లక్ష్యం గురించి నీకు క్లుప్తంగా చెబుతాను విను.