శ్లోకం - 13

ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్‌మామనుస్మరన్ | యః ప్రయాతి త్యజన్‌దేహం స యాతి పరమాం గతిమ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అక్షర బ్రహ్మస్వరూపమైన ఓంకారమును ఉచ్చరించుచు, పరమేశ్వరుడినైన నన్ను స్మరిస్తూ భౌతిక శరీరంను విడిచిపెట్టేవాడు మోక్షమును పొందుచున్నాడు.