శ్లోకం - 16
ఆబ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినో௨ర్జున | మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, బ్రహ్మలోకంతో సహా ఈ భౌతిక విశ్వంలోని సమస్త లోకాలూ పునర్జన్మ కలుగజేసేవే. కానీ, నన్ను చేరిన వారికి మాత్రం పునర్జన్మ కలుగదు.