శ్లోకం - 19

భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే | రాత్ర్యాగమే௨వశః పార్థ ప్రభవత్యహరాగమే ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, వివిధములైన సమస్త జీవరాశుల సముదాయము బ్రహ్మ యొక్క ప్రతి పగలు నందు సృష్టించబడి, మరల ప్రతి రాత్రి ప్రారంభ కాలమున బ్రహ్మ యందే విలీనమగుచున్నది.