శ్లోకం - 21

అవ్యక్తో௨క్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిమ్ | యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ అవ్యక్తము నిత్యమైనది మరియు నాశనం లేనిది అని చెప్పబడుచున్నది. అదియే పరమగతి. ఎవరైతే ఆ పరమగతిని పొందుతారో వారికి పునర్జన్మ ఉండదు. అట్టి నా యొక్క నివాసము పరమ శ్రేష్టమైనదని తెలుసుకొనుము.