శ్లోకం - 2

రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమమ్ | ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయమ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ జ్ఞానము విద్యలలో రాజువంటిది, పరమ రహస్యమైనది, సర్వోన్నతమైనది, పవిత్రమైనది, ప్రత్యక్ష్య అనుభవముచే తెలుసుకోదగినది, ధర్మము తప్పనిది, ఆచరించటానికి సులువైనది, నాశనం లేనిది.