శ్లోకం - 3

అశ్రద్దధానాః పురుషా ధర్మస్యాస్య పరంతప | అప్రాప్య మాం నివర్తంతే మృత్యుసంసారవర్త్మని ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, ఈ ధర్మమార్గంపై విశ్వాసం లేని వారు నన్ను పొందలేరు. వారు జనన మరణ చక్రం నందు చిక్కుకొని మళ్ళీ మళ్ళీ పునర్జన్మ పొందుతున్నారు.