శ్లోకం - 4

మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా | మత్‌స్థాని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ సమస్త జగత్తు నా అవ్యక్త స్వరూపంచే వ్యాపించి ఉన్నది. సర్వ ప్రాణులు నాలోనే ఉన్నవి. కానీ, నేను మాత్రం వాటిలో లేను.