శ్లోకం - 5

న చ మత్‌స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరమ్ | భూతభృన్న చ భూతస్థః మమాత్మా భూతభావనః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సర్వ ప్రాణులు నాలో స్థిరముగా లేవు. ఈశ్వర సంబంధమైన నా యోగశక్తిని చూడుము. నేను అన్ని జీవుల సృష్టి కర్తను మరియు పర్యవేక్షకుడిని అయినప్పటికీ, నేను ఆ ప్రాణుల వలన కానీ మరియు భౌతిక ప్రకృతి వలన కానీ ప్రభావితము కాను.