శ్లోకం - 6

యథా௨௨కాశస్థితో నిత్యం వాయు సర్వత్రగో మహాన్ | తథా సర్వాణి భూతాని మత్‌స్థానీత్యుపధారయ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సర్వత్ర సంచరించుచున్న విస్తృతమైన గాలి నిత్యం ఆకాశంలో స్థితమై ఉంటుంది. అట్లే సమస్త జీవులు నాలో స్థితమై ఉంటాయని గ్రహించుము.