శ్లోకం - 7
సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికామ్ | కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, కల్పాంతము నందు సమస్త ప్రాణులు నా ప్రకృతిలో చేరుచున్నవి. కల్పము ప్రారంభం నందు సర్వ ప్రాణులను మళ్ళీ నేను సృష్టిస్తున్నాను.