శ్లోకం - 11
అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్ | పరం భావమజానంతః మమ భూతమహేశ్వరమ్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సర్వ ప్రాణులను శాసించే మహేశ్వరుడినైన నన్ను గుర్తించలేని మూఢులు, మానవరూపంలో ఉన్న నన్ను సాధారణ వ్యక్తిగా భావించి అవమానించుచున్నారు.