శ్లోకం - 15
జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే | ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖమ్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కొందరు జ్ఞానులు విశ్వరూపుడినైనా నన్ను జ్ఞాన సముపార్జనా యజ్ఞము ద్వారా అభేద భావముతో ఉపాసించుచుందురు. మరికొందరు అనంత రూపుడనైన నన్ను ద్వైత భావముతోనూ, ఇంకొందరు భిన్న భావముతోనూ పూజించుచున్నారు.