శ్లోకం - 17
పితా௨హమస్య జగతః మాతా ధాతా పితామహః | వేద్యం పవిత్రమోంకారః ఋక్సామ యజురేవ చ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ విశ్వం నందుగల సర్వ ప్రాణులకు తల్లిని, తండ్రిని మరియు తాతను నేనే. వేదముల నుండి తెలుసుకొనదగిన పవిత్ర శబ్దము ఓం కారమును నేనే. ఋగ్వేదము, సామవేదము మరియు యజుర్వేదము కూడా నేనే.