శ్లోకం - 18

గతిర్భర్తా ప్రభుః సాక్షీ నివాసః శరణం సుహృత్ | ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజమవ్యయమ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ జగత్తుకు పరమగతియైన పరమధామమును, భరించు వాడను, పోషించు వాడను, స్వామిని, సాక్షిని, నివాసమును, ఆశ్రయమును మరియు స్నేహితుడను నేనే. నేనే సమస్త సృష్టికి మూలము, అంతము, మరియు ఆధారము. నేనే నాశనము లేని శాశ్వత బీజమును.