శ్లోకం - 19

తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ | అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, నేనే సూర్యుని రూపంలో వేడిని కలుగజేస్తున్నాను. నేనే వర్షమును నిలువరిస్తాను, నేనే వర్షమును కురిపిస్తాను. అమరత్వం మరియు మృత్యువును నేనే. నేను సత్తూ(శాశ్వతమైన ఆత్మ) మరియు అసత్తూ(తాత్కాలిక స్వభావం కలిగిన పదార్థము) నేనే.