శ్లోకం - 20

త్రైవిద్యా మాం సోమపాః పూత పాపాః యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే | తే పుణ్యమాసాద్యసురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివి దేవభోగాన్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: మూడు వేదాలు అధ్యయనము చేసిన వారు యజ్ఞాలతో నన్ను పూజించి, సోమపానంచేసి పవిత్రులై, పాపములు పోగొట్టుకొని స్వర్గాన్ని ఆశించెదరు. అట్టి వారు పుణ్యప్రదమైన దేవేంద్ర లోకమును పొంది దివ్యమైన దేవతా భోగాలు అనుభవించుచున్నారు.