శ్లోకం - 21

తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి | ఏవం త్రయీధర్మమనుప్రపన్నాః గతాగతం కామకామా లభంతే ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: వారు విశాలమైన స్వర్గలోకము నందు భోగములను అనుభవించి, పుణ్యములు తగ్గిపోయిన తరువాత వారు మరల భూలోకమున ప్రవేశించుచున్నారు. ఈ విధముగా భోగములను అనుభవించుటకు వైదిక కర్మ కాండలను ఆచరించే వారు మళ్ళీ మళ్ళీ పునర్జన్మ పొందుతుంటారు.