శ్లోకం - 24
అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ | న తు మామభిజానంతి తత్త్వేనా௨తశ్చ్యవంతి తే ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సకల యజ్ఞములకు భోక్తను మరియు ఫలములను ఇచ్చే ప్రభువును కూడా నేనే. వారు నా పరమేశ్వర తత్వము గురించి గ్రహించక పునర్జన్మ పొందుచున్నారు.