శ్లోకం - 25

యాంతి దేవవ్రతా దేవాన్ పితౄన్ యాంతి పితృవ్రతాః | భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మద్యాజినో௨పి మామ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఇతర దేవతలను ఆరాధించు వారు ఆయా దేవతలను పొందుతారు. పితృదేవతలను సేవించువారు పితరులను చేరుతారు. భూతప్రేతములను అర్చించువారు భూతప్రేతములనే పొందుతారు. నన్ను పూజించే వారు నన్నే పొందుతారు.