శ్లోకం - 26

పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి | తదహం భక్త్యుపహృత మశ్నామి ప్రయతాత్మనః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఎవరైతే పరిశుద్ధమైన మనస్సుతో, నిష్కామభావముతో పత్రము గాని, పుష్పము గాని, పండు గాని, నీళ్ళు గాని నాకు భక్తితో సమర్పించుచున్నారో, వాటిని నేను సంతోషంగా ఆరగిస్తాను.