శ్లోకం - 27

యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ | యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణమ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, నీవు ఏ పని చేసినను, భోజనం చేసినను, హోమం చేసినను, దానము చేసినను, తపస్సు చేసినను వాటన్నింటిని నాకే సమర్పించుము.