శ్లోకం - 30

అపి చేత్సుదురాచారః భజతే మామనన్యభాక్ | సాధురేవ స మంతవ్యః సమ్యగ్వ్యవసితో హి సః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఎంతటి పాపాత్ములైనప్పటికీ అనన్యభక్తితో నన్ను పూజించే వారిని సత్పురుషులుగానే భావించాలి. ఎందుకంటే వారి యొక్క ఉన్నతమైన ఆధ్యాత్మిక ఆశయం వలన వారిని ధర్మాత్ములుగానే పరిగణించ వలసి ఉంటుంది.