శ్లోకం - 32

మాం హి పార్థ వ్యపాశ్రిత్య యే௨పి స్యుః పాపయోనయః | స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తే௨పి యాంతి పరాం గతిమ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, జన్మ, లింగ, కుల, లేదా జాతి భేదము లేకుండా ఎవరైనా నన్ను సంపూర్ణముగా ఆశ్రయిస్తే, వారు పరమగతిని పొందుతారు.