శ్లోకం - 33

కిం పునర్బ్రాహ్మణాః పుణ్యాః భక్తా రాజర్షయస్తథా | అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మామ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఇక పుణ్యాత్ములైన బ్రాహ్మణులు, మునులు మరియు భక్తులైన రాజర్షులు నన్ను ఆశ్రయించినచో వారు పరమపదమును చేరుదురని చెప్పవలసిన పనియేలేదు. కనుక, సుఖంలేని తాత్కాలికమైన ఈ లోకంలో పుట్టిన నీవు నన్ను భక్తితో పూజించు.