శ్లోకం - 34
మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు | మామేవైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నా యందే నీ మనస్సును ఉంచి, నా భక్తుడవై నన్నే పూజించుము. ఈ విధంగా నీ మనస్సు మరియు శరీరము నాకే అర్పించుటచే నన్నే పొందగలవు.