శ్లోకం - 6

మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తథా | మద్భావా మానసా జాతాః యేషాం లోక ఇమాః ప్రజాః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సప్తమహర్షులు, అంతకు పూర్వము సనకసనందనాది నలుగురు మహామునులు మొదలగు వారందరూ నా మనస్సు నుండే పుట్టారు. ఈ ప్రపంచంలోని ప్రజలందరూ వీరి వారసులగా అవతరించారు.