శ్లోకం - 14

సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ | న హి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవా న దానవాః ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ కేశవా! నీవు నాతో చెప్పిందంతయూ నిజమేనని నేను దృఢ విశ్వాసంతో నమ్ముతున్నాను. దేవతలకు, రాక్షసులకు కూడా నీ నిజస్వరూపం తెలియదు.