శ్లోకం - 15

స్వయమేవాత్మనా௨త్మానం వేత్థ త్వం పురుషోత్తమ | భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ పురుషోత్తమా, సమస్త భూతముల సృష్టికర్త, సకల జీవులకు ప్రభువు, దేవాదిదేవా, విశ్వానికి సార్వభౌమా, నీ గురించి నీవే స్వయముగా తెలుసుకొనుచున్నావు.