శ్లోకం - 21
ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషాం రవిరంశుమాన్ | మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అదితి యొక్క 12 మంది పుత్రులలో విష్ణువును నేను. జ్యోతులలో కిరణాలు ప్రసరించే సూర్యుడిని నేను. 49 మంది మరత్తులలో తేజస్సు కలిగిన మరీచి నేను. ఆకాశంలోని నక్షత్రములలో చంద్రుడిని నేను.