శ్లోకం - 23

రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసామ్ | వసూనాం పావకశ్చాస్మి మేరుః శిఖరిణామహమ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: శివుని పదకొండు స్వరూపములైన రుద్రులలో శంకరుడు నేను. యక్షలు మరియు రాక్షసులలో ధనాధిపతియైన కుబేరుడను నేను. ఈ జగత్తు సృష్టిలో మూలమైన అష్టవసువులలో అగ్నిని నేను. పర్వతాలలో మేరు పర్వతంను నేను.