శ్లోకం - 25
మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరమ్ | యజ్ఞానాం జపయజ్ఞో௨స్మి స్థావరాణాం హిమాలయః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: మహర్షులలో భృగు మహర్షిని నేను. శబ్దములలో ఏకాక్షరమైన "ఓం" కారమును నేను. యజ్ఞములలో జపయజ్ఞమును నేను. స్థావరములలో హిమాలయ పర్వతంను నేను.