శ్లోకం - 26

అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః | గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: వృక్షాలలో రావి చెట్టును నేను. దేవర్షులలో నారదుడను నేను. గంధర్వులలో చిత్రరథుడను నేను. సిద్ధులలో కపిలమునిని నేను.