శ్లోకం - 27

ఉచ్చైఃశ్రవసమశ్వానాం విద్ధి మామమృతోద్భవమ్ | ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపమ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: గుర్రాలలో అమృత సముద్రము చిలకటం వలన పుట్టిన ఉచ్చైఃశ్రవమును నేను. ఏనుగులలో ఐరావతమును నేను. మనుషులలో రాజుని నేను.