శ్లోకం - 29
అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహమ్ | పితౄణామర్యమా చాస్మి యమః సంయమతామహమ్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నాగులలో ఆదిశేషుడిని నేను. నీటి యందు వసించే జీవులలో వరుణుడిని నేను. పితృ దేవతలలో అర్యముడను నేను. పాలన అందిచే వారిలో యమధర్మరాజుని నేను.