శ్లోకం - 31

పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహమ్ | ఝుషాణాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవీ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: పవిత్రం చేసేవాటిలో వాయువును నేను. శస్త్రధారులలో రాముడిని నేను. జల జీవులలో మొసలిని నేను. నదులలో గంగా నదిని నేను.