శ్లోకం - 33
అక్షరాణామకారో௨స్మి ద్వంద్వః సామాసికస్య చ | అహమేవాక్షయః కాలః ధాతా௨హం విశ్వతోముఖః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అక్షరాలలో "అ"కారమును నేను. సమాసములలో ద్వంద్వ సమాసమును నేను. అపరిమితమైన కాలమును నేను. సృష్టికర్తలలో బ్రహ్మను నేను.