శ్లోకం - 35
బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహమ్ | మాసానాం మార్గశీర్షో௨హం ఋతూనాం కుసుమాకరః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సామవేద మంత్రములలో బృహత్సామమును నేను. ఛందస్సులలో గాయత్రీఛందస్సును నేను. మాసాలలో మార్గశీర్ష మాసమును నేను. ఋతువులలో వసంత ఋతువును నేను.