శ్లోకం - 37
వృష్ణీనాం వాసుదేవో௨స్మి పాండవానాం ధనంజయః | మునీనామప్యహం వ్యాసః కవీనాముశనా కవిః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: యదు వంశస్థులలో కృష్ణుడిని నేను. పాండవులలో అర్జునుడిని నేను. మునులలో వేద వ్యాసుడిని నేను. జ్ఞానులలో శుక్రాచార్యుడిని నేను.