శ్లోకం - 38
దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతామ్ | మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహమ్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: శిక్షించే వారిలో దండనను నేను. విజయం సాధించాలనే కోరిక కలవారిలో సత్ప్రవర్తనను నేను. రహస్యాలను కాపాడడంలో మౌనమును నేను. జ్ఞానవంతులలో జ్ఞానమును నేను.