శ్లోకం - 1
అర్జున ఉవాచ: మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంజ్ఞితమ్ | యత్త్వయోక్తం వచస్తేన మోహో௨యం విగతో మమ ||
తాత్పర్యం
అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: నా మీద దయతలచి ఎంతో రహస్యమైన ఆధ్యాత్మిక విషయాలను ఉపదేశించావు. ఫలితంగా నా అజ్ఞానం పూర్తిగా తొలిగిపోయింది.