శ్లోకం - 3

ఏవమేతద్యథాత్థ త్వమ్ ఆత్మానం పరమేశ్వర | ద్రష్టుమిచ్ఛామి తే రూపమ్ ఐశ్వరం పురుషోత్తమ ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ పరమేశ్వరా(కృష్ణా), నీ గురించి నీవు చెప్పిన ప్రతి మాట నిజం. ఓ పురుషోత్తమా(కృష్ణా) ఇప్పుడు నాకు ఈశ్వర సంబంధమైన నీ విశ్వరూపమును ప్రత్యక్షముగా చూడాలని కోరుకుంటున్నాను.