శ్లోకం - 4

మన్యసే యది తచ్ఛక్యం మయా ద్రష్టుమితి ప్రభో | యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయమ్ ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ ప్రభూ! యోగేశ్వరా, నీ విశ్వరూపమును చూడడం నాకు సాధ్యమని నీవు భావించినట్లైతే శాశ్వతమైన నీ విశ్వరూపమును నాకు చూపించుము.